స్ట్రాంగు లీడర్ కేసీఆర్ ఉండగా రాంగ్ లీడర్లు ఎందుకు : మంత్రి

by Naresh N |
స్ట్రాంగు లీడర్ కేసీఆర్ ఉండగా రాంగ్ లీడర్లు ఎందుకు : మంత్రి
X

దిశ, సంగారెడ్డి : తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ ఉండగా రాంగ్ లీడర్లు ఎందుకు అని మంత్రి హరీశ్ రావు కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సర్వేలు అన్ని హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటున్నాయి. తెలంగాణ ద్రోహులంతా ఒక్కటువుతున్నారని, పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలుపుతున్నారన్నారు. తెలంగాణ ఇస్తే భోజనం మానేసిన అన్నాడని, తెలంగాణ ఇవ్వమంటే చేతిలో సిగరేట్, బీడి అని అనుకున్నారా, నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ రాదు అని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు.

వైస్ షర్మిల కాంగ్రెస్ కు ఓటేయ్యమంటుంది. వీరందరూ తెలంగాణ రాకుండా అడ్డుకున్నారని, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిఅని, తెలంగాణ ద్రోహులంతా జట్టుకట్టారని, తెలంగాణ వ్యతిరేకులతోనే రేవంత్ దోస్తానమన్నారు. చావునోట్లు తలబెట్టి తెలంగాణ తెచ్చింది కేసీఆర్అని, పదవులకు రాజీనామా చేయకుండా పదవులను పట్టుకుని ఉన్నారన్నారు. తెలంగాణ గెలివాలంటే కారు గుర్తుకు ఓటేయ్యాలి. తెలంగాణ ఓడాలంటే క్రిమినల్ గ్యాంగులకు ఓటెయ్యాలి. రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పట్టుకుని క్రిమినల్ అంటున్నాడు, నీవు ఖైది నంబర్ 4100, బెయిల్ పై బయట ఉన్న ఖైదీవి నీవు, క్రిమినల్ వు నీవు అని రేవంత్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ను గంపగుత్తగా అమ్ముకున్నాడని, వాళ్లు వస్తే తెలంగాణను అమ్ముకుంటాడని కాంగ్రెస్ పార్టీ వారే అంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఉస్మానియా స్టూడెంట్లు‌ను అడ్డా కూలీలని, బీరుకు, బిర్యానీకీ అమ్ముడుపోతారన్నారు. విద్యార్థుల పట్ల అవహేళనగా మాట్లాడడని తెలిపారు.



కాంగ్రెస్ రకరకాల కుట్రలతో బయలుదేరింది. తెలంగాణలో కోట్లాటలు లేవని, తప్పిపోయి కాంగ్రెస్ కు ఓటేస్తే తిప్పలు తప్పవన్నారు. కర్నాటకలో ఏమైందో చూశాం కదా కర్నాటక రైతులు కరెంట్ ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ , టీఎన్.జీఓల సంఘం మాజీ అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్, బీఆర్ఎస్ సంగారెడ్డి కన్వీనర్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మానిక్యం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మీ, వైస్ చైర్ పర్సన్ లతా విజయేందర్ రెడ్డి, ఎం.ఏ.ముఖీం, మనోహర్ గౌడ్, జెడ్పీటీసీ సునీతా మనోహర్ గౌడ్, బీరయ్య యాదవ్, ఫేఖ్ రషీద్, మున్సిపల్ కౌన్సిలర్లు, సంగారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story