- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ నుంచి కేసీఆర్ ను తరిమికొడతాం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ట్విట్టర్ టిల్లూను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి
ప్రశ్నాపత్రం లీకవడంతో 30లక్షల మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం
దిశ, సంగారెడ్డి: రాష్ట్రంలో రాచరిక పాలన సాగిస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో బీజేపీ జిల్లా కార్యాలయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగత్ ప్రకాశ్ నడ్డా వర్చువల్ గా ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా కార్యాలయంతో పాటు మరో ఐదు జిల్లాల్లో కార్యాలయాలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీకి బలం, బలగం కార్యకర్తలేనని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే గెలుపుని ఆయన అన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ పార్టీ వరుసగా విజయాలు సాధిస్తూనే ఉందన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం రాబోతుందని తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని అన్నారు. టీ.ఎస్.పీ.ఎస్.సీ ప్రశ్నాపత్రం లీకేజీతో దాదాపు 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని దుస్థితిలో ఉందా అంటూ ఎద్దేవా చేశారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను వెంటనే ప్రక్షాళన చెయాలని, ప్రస్తుత సభ్యులను తొలగించి నూతన సభ్యులను నియమించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలన్నారు. ట్విట్టర్ టిల్లూ కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. పరువు లేని కూడా తన మీద పరువు నష్టం కేసు వేశారని ఆరోపించారు. కేటీఆర్.. మోదీని బ్రోకర్ అనే ముందు మీ నాన్న పాస్ పోర్ట్ బ్రోకర్ కాదా అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.
ఎప్పుడూ ప్రధాని తిడుతూ టైం పాస్ చేస్తున్న ట్విట్టర్ టిల్లూ, సీఎం కేసీఆర్ ను తెలంగాణ నుంచి తరమికొడతామని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ అభివద్ధికి రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ ఇన్ చార్జి తరుణ్ చుగ్, మురళీధర్ రావు, ఎమ్మెల్యే రఘునందన్ రావు, సంగప్ప, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.