- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారంలోకి రాగానే కేసీఆర్ అక్రమ ఆస్తులు బయటికి తీస్తాం : ఈటల
దిశ, జగదేవపూర్: బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ సంపాదించిన అక్రమ ఆస్తులను బయటకు తీస్తామని గజ్వేల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్ సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయంలో ఈటేల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈటలకు కొండపోచమ్మ వద్ద జిలేబీలతో తులాభారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోలీస్, అధికార యంత్రాంగ బలం, వేల కోట్లతో నన్ను ఓడించేందుకు ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నారని అయినప్పటికీ హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుపొందానని తెలిపారు. ప్రజలను, ధర్మాని, శ్రమను నమ్ముకున్నాను కాబట్టే గత 20 ఏళ్లుగా ఓటమి ఎరగకుండా ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. సీఎం 9 ఏళ్లుగా గజ్వేల్ ప్రజలకు, నాయకులకు ముఖం చూపించకుండా ప్రగతిభవన్ , ఫాంహౌస్ కే పరిమితం అయ్యారని ఆరోపించారు.
గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈటల గజ్వేల్ కు రాగానే సర్పంచ్ ల బిల్లులు క్లియర్ అవుతున్నాయని, వాటిని తీసుకొని కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. కేసీఆర్ ను గెలిపించిన పాపానికి పేదల భూములను తీసుకొని పరిశ్రమలకు అప్పగిస్తున్నారని, బీజేపీ అధికారంలోకి రాగానే రైతుల భూములను తిరిగి వారికే ఇప్పిస్తామని పేర్కొన్నారు. వందమంది జేజమ్మలు దిగివచ్చిన గజ్వేల్ లో ఈటలను ఓడించలేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఎల్లు రాంరెడ్డి, కప్పర ప్రసాద్ రావు, గుర్రం శ్రీధర్, కుడిక్యాల రాములు, గర్నెపల్లి కృష్ణమూర్తి, చంద్రబోస్, బీమరి గణేష్, హేమ సురేష్, నలగామా శ్రీనివాస్, పేర్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.