- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే మైనంపల్లి
దిశ, మెదక్ టౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తెలిపారు. గురువారం మెదక్ మండలం రాయిన్ పల్లి గ్రామం చెరువులో మత్స్య అభివృద్ధి, స్టేట్ సెక్టార్ పథకం ద్వారా 100% ఉచిత చేప పిల్లల విడుదల కార్యాలయంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఎమ్మెల్యే చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన లో మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 66 లక్షల చేప పిల్లలను దాదాపు 82 చెరువులల్లో ఉచితంగా విడుదల చేయడం జరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుందని, మత్స్యకారులకు 5 లక్షల ప్రమాద బీమా చేశామని అన్నారు. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ, జిల్లాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మత్స్యకారులకు చేపలను అమ్మేందుకు 10 లక్షల విలువ చేసే వాహనాలను 40% సబ్సిడీ తో అందిస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు ఇలాంటి సమస్యలు వచ్చినా తాను అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు మానేగాళ్ళ రాంకిష్టయ్య, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ హన్మంత్ రావు, జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం, ఎమ్మార్వో లక్ష్మణ్ బాబు, అర్ఐ లక్ష్మణ్, మత్స్యశాఖ సిబ్బంది సంతోష్, భరత్, డేవిడ్ మల్లేష్ జయరాం, యాదగిరి, వాజీద్ తదితరులు పాల్గొన్నారు.