మేళ్ల చెరువులో వ్యర్థాల తొలగింపు..

by Kalyani |
మేళ్ల చెరువులో వ్యర్థాల తొలగింపు..
X

దిశ, పటాన్ చెరు: 'కంపు కొడుతున్న మేళ్ల చెరువు' అనే శీర్షికతో దిశ దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇళ్లలో నుంచి వచ్చే మురుగు నీటితో కంపు కొడుతున్న మేళ్ల చెరువును శుభ్రం చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. ట్రాక్టర్ల సహాయంతో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు. చెరువులో నిండిన వ్యర్థాలను సైతం తొలగించి చెరువును శుద్ధి చేస్తామని మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ఇన్ని రోజులుగా దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు, సమస్యను వెలుగులోకి తెచ్చిన 'దిశ' కు ధన్యావాదాలు తెలుపుతూ అభినందించారు.

Advertisement

Next Story