ఎమ్మెల్యే ను నిలదీసిన గ్రామస్తులు…కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్తత

by Kalyani |
ఎమ్మెల్యే ను నిలదీసిన గ్రామస్తులు…కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్తత
X

దిశ, సంగారెడ్డి బ్యూరో /నారాయణఖేడ్: గ్రామంలో మూడు, నాలుగు రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో దసరా పండుగలో నానా అవస్థలు పడ్డారు. ఇద్దరు మరణించారు. 60 మందికి పైనే అస్వస్థతకు గురయ్యారు. రెండు సార్లు వచ్చినా గాని గ్రామంలో ఏం చేశావని గ్రామస్తులు ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి ని నిలదీశారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరికొకరు కొట్టుకున్నారు. మూడు రోజులైనా గాని మంచినీరు రాకపోవడంతో తాము తల్లడిపోయామని, ఏ ముఖం పెట్టుకొని వచ్చావని గ్రామస్తులు ఎమ్మెల్యేను నిలదీశారు. ఎన్నడూ లేని విధంగా నీ పరిపాలన ఉన్నదని చెప్పినప్పుడు కూడా ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహించారు. గ్రామంలో కనీసం నీరు సరఫరా చేయడానికి చేతకాకపోతే ఏమిటని ఎమ్మెల్యేపై మండిపడ్డారు.

గ్రామంలో జనం చచ్చిపోతే ఎమ్మెల్యే కు చీమకుట్టినట్టు లేదని, ఇలాంటి ఎమ్మెల్యేను తాము ఎప్పుడూ చూడలేదని గ్రామస్తులు శాపనార్థాలు పెట్టారు. దసరా పండుగ రోజు గ్రామంలో పండుగ జరుపుకోలేదని, పుట్టకు ఒక్కరు, గుట్టకు ఒక్కరు అయ్యామని వాపోయారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యం వలన గ్రామంలో పండుగ జరుపుకోలేదని ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. చిన్న సమస్యనే తీర్చలేదని, పెద్ద సమస్యలు వస్తే ఏం తీరుస్తారని ఎమ్మెల్యేను నిలదీశారు. మాకు దసరా అంటేనే పెద్ద పండుగ కనీసం నీరు ఇవ్వని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే ముందే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాట మాట పెరిగి గొడవలకు దారి తీసింది. దీంతో ఎమ్మెల్యే తిరిగి వెళ్ళిపోయారు. మూడు నాలుగు రోజుల నుంచి పరిస్థితి ఆసుపత్రి చుట్టే తిరుగుతున పట్టించుకున్న పాపాన పోలేదనీ ఎమ్మెల్యేపై గ్రామస్తులు మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed