- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుద్దెడ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ
by Kalyani |
X
దిశ కొండపాక: రాజీవ్ రహదారిపై వాహనాల రద్దీ రెండో రోజు కొనసాగుతుంది. పండుగలకు సొంత గ్రామాలకు వచ్చిన వారు తిరిగి హైదరాబాద్ కు వెళ్తుండటంతో కొండపాక మండలం దుద్దెడ టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. వరుస సెలవులు అనంతరం తిరిగి వెళ్తుండటంతో ఆదివారం సాయంత్రం నుంచి వాహనాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెరుగుతూ వచ్చింది. అలాగే సోమవారం మధ్యాహ్నం వరకు భారీగా తరలిన వాహనాలు మధ్యాహ్నం కొంత సమయం అంతంతమాత్రంగా వెళ్లాయి. మళ్ళీ సాయంత్రం వాహనాల రద్దీ బాగా పెరిగింది. సుమారు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ ప్లాజా సిబ్బంది ఎప్పటికప్పుడు వాహనాలను పంపిస్తున్నప్పటికీ రద్దీ పెరుగుతూ వచ్చింది. సాధారణ కౌంటర్ల కంటే మరో రెండు కౌంటర్లను పెంచి వాహనాలు పంపిస్తున్నారు.
Advertisement
Next Story