- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పిన ఉపసర్పంచ్..
దిశ, చిన్నకోడూర్ : మండల పరిధిలోని చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఉపసర్పంచ్ జెల్ల రవీందర్ యాదవ్ బీజేపీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ బాల్ నర్స్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. బుధవారం సిద్దిపేట బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి రవీందర్ యాదవ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి బీజేపీలో చేరినట్లు తెలిపారు.
కరోనా కష్ట కాలం నుండి నేటి వరకు పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 2023 - 24 సీజన్ కు గాను పంటల మద్దతు ధరలు పెంచి రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలవడం హర్షనీయం అన్నారు. భారతీయ జనతా పార్టీ పటిష్టత కోసం తన వంతు కృషి చేస్తానని రవీందర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చిన్నకోడూరు మండల అధ్యక్షుడు పిట్ల పర్శరాములు, జిల్లా అధికార ప్రతినిధి మెరుగు భూమేష్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సురగొని శివరాం, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నాగరాజు, బీజేపీ చిన్నకోడూర్ మండల ఉపాధ్యక్షులు పెండ్యాల రమేష్, నగరం కనుకరాజ్, చెర్లఅంకిరెడ్డి పల్లి గ్రామ శాఖ కార్యకర్తలు కోహెడ నవీన్, మధు, మనీష్ తదితరులు పాల్గొన్నారు.