- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ మీ అబ్బా జాగీరా కాదు : మైనంపల్లి
దిశ, మెదక్ ప్రతినిధి: తెలంగాణ కేసీఆర్ జాగిర్ కాదని, మైనంపల్లి రోహిత్ గెలుపును ఎవరు ఆపలేరని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మెదక్ రోడ్ షో కు వచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు. రోహిత్ ను చిన్న పిల్ల వాడిగా చెప్పే అధికార పార్టీ నేతలు మెదక్ లో ఎందుకు భయపడి రెండు సార్లు సీఎం సభ ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఓటమి భయం వల్లనే మల్కాజ్ గిరి, మెదక్ నియోజక వర్గాలలో అల్లుడు హరీష్ రావు, కేటీఆర్ లను ఇంచార్జ్ లుగా పెట్టరా అని నిలదీశారు. రాష్ట్రంలో భూ కబ్జాలు చేసి లక్షల కోట్లు ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. డబ్బులతో ఓట్లు కొనే ధీమా తో ఉన్నారని, కల్వకుంట్ల కుటుంబానికి భయపడేది లేదని అన్నారు. కేసీఆర్ పాలన రాజుల కాలం నాటి నియంత పాలన చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు డమ్మీలుగా చేసి ప్రజలను మభ్య పెట్టి పదేళ్ల పాలన చేశాడని అన్నారు. కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, చాలు దొర నీ పాలన అనే రోజులు వచ్చాయని అన్నారు. గతంలో మీ చరిత్ర ఏమిటని ప్రశ్నించారు.
ఉద్యోగం చేసే కేటీఆర్ కు మంత్రి పదవి అవసరమా అన్నారు. అల్లుడు, కొడుకు, కుమార్తెలకు కేసీఆర్ జిల్లాలు పంచి ఇచ్చాడని అన్నారు. అమరుల త్యాగాలకు చలించిన సోనియా తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబం సుఖ పడుతున్నారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రెండు చోట్ల అధికారం కోల్పోయిన అమరుల కోసం త్యాగం చేసిందని అన్నారు. కానీ పేదల కోసం కృషి చేయాల్సిన సీఎం ప్రగతి భవన్, ఫామ్ హౌస్ కు వెళ్లి రావడానికి ఏడాదికి రూ. 80 కోట్లు ఖర్చు చేస్తూ పదేళ్లలో రూ. 800 కోట్లు ప్రజా ధనం వృదా చేశాడని విమర్శించారు. అసైన్డ్ భూములకు పట్టాలిచ్చి దోచుకున్నారని, మెదక్ జిల్లా నుంచి వేలాదికోట్ల ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డి కనబడితే ప్రజలు వెంటబడి కొడతారని, ప్రచారంకు వెళ్లవద్దని మంత్రే చెప్పారని అన్నారు. గతంలో వచ్చిన కేసీఆర్ మెదక్ రింగ్ రోడ్, ఎన్ ఎస్ ఎఫ్, మెడికల్ కళాశాల హామీలు పదేళ్ల క్రితం ఇచ్చినవే మళ్ళీ వచ్చి ఇవ్వడం ఏమిటని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ఇంటికి పంపితెనే రాష్ట్రం బాగు పడుతుందని అన్నారు.