- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ కచరా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
దిశ, మెదక్ ప్రతినిధి : కేసీఆర్ నువ్వు ఒక కచరా గాడివి.. నీ బతుకు, నీ సర్వం పోసిన నా కాలి గోటి ని కొనలేని సన్యాసివని టీపీసీసి అధ్యక్షడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండి పడ్డారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే యాత్రలో భాగంగా స్థానిక రాందాస్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనం పల్లి రోహిత్ ఆధ్యర్యంలో నిర్వహించారు. మైనం పల్లి హన్మంతరావు, నర్సాపూర్ అభ్యర్థి రాజిరెడ్డి, దుబ్బాక అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు వేలాది మంది ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్ కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ వల్ల వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని ఎప్పుడో జుమ్మ బజార్ లో కేసీఆర్ తాకట్టు పెట్టాడని, ఎలాంటి కేసీఆర్ తనపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం పై ఆగ్రహించాడు. కేసీఆర్ ఒక కచర అని కేసీఆర్ లో మొదటి అక్షరాలు తీసుకుంటే కచరా అన్నారు. రేవంత్ రెడ్డిని రేటు పెట్టి కోనేవాడు భూమి మీద లేదన్నారు. అలా అనుకుంటే రాష్ట్రంలో ప్రజల పక్షాన కేసీఆర్ ను ప్రశ్నిచే గొంతే ఉండేది కాదు అన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి బెల్టు షాప్ క తెలంగాణ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో బడి పిల్లగాడు కూడా బీరు సీసా పట్టుకునే వరకు వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.
కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ భూమిలో కుంగితే అసాఘిక శక్తులు బాంబులు పెడితే కుంగి పోతుందని చెప్పావు.. ఎక్కడైనా బాంబులు పెడితే గాల్లో పేలుతుంది.. కానీ భూమిలో ఎలా కుంగుతుందని ప్రశ్నించారు. వేల పుస్తకాలు చదివినా కేసీఆర్ కు మేడి గడ్డ ఎందుకు కుంగిందో తెలియదా అని నీలదీశారు. రాష్ట్రంలో ధరలు పెరిగి పోయాయని, భావించి మహిళకు నెలకు 2500 వేస్తుందని చెప్పారు. అదే దీపం పథకం ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు 500 కే సిలెండర్ ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల కోసం ఆరు గ్యాంటీలు తీసుకు వచ్చిందని చెప్పారు. ఇందిరమ్మ పథకం కింద ఐదు లక్షలు, ఎకరాలు 15,000 రూపాయలు, కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రతి ఏటా రూ.12,000 వేలు కాంగ్రెస్ ఇస్తుందని చెప్పారు. ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ కు అధికారం అప్పగించాలని కోరారు.