- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Parliament: పార్లమెంటుని కుదిపేసిన అదానీ వ్యవహారం.. ఉభయసభలు వాయిదా
దిశ, నేషనల్ బ్యూరో: అదానీ వ్యవహారం (Adani issue)తో పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ అంశం పార్లమెంట్ శీతాకాల సమావేశాలను (Winter session of Parliament) కుదిపేస్తోంది. ప్రతిపక్షాల నిరసనలతో ఉభయసభలు మరోసారి వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఉభయసభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభ (Lok Sabha) ప్రారంభం కాగానే ఇటీవలే జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ, నాందేడ్ ఎంపీగా రవీంద్ర వసంతరావు చవాన్ చేత స్పీకర్ ఓం బిర్లా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత సభా కార్యక్రమాలను మొదలు పెట్టారు. విపక్ష పార్టీల ఎంపీలు సభలో అదానీ అంశాన్ని లేవనెత్తారు. అదానీ సంస్థపై నమోదైన కేసు, ఈ సంస్థపై వచ్చిన ఆరోపణలపై చర్చకు ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సభలో నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. దీంతో స్పీకర్ సభను 12 గంటల వరకూ వాయిదా వేశారు. ఆతర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ నిరసనలు వెల్లువెత్తడంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
రాజ్యసభ వాయిదా
మరోవైపు ఎగువ సభలోనూ (Rajya Sabha) ఇదే పరిస్థితి నెలకొంది. అదానీ వ్యవహారంపై చర్చకు కాంగ్రెస్ సహా విపక్ష ఇండియా కూటమి ఎంపీలు పట్టుపడటంతో సభను 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్ష ఎంపీలు శాంతించలేదు. విపక్ష ఎంపీల నినాదాలతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో, ఛైర్మన్ జగదీప్ దంఖర్ శుక్రవారానికి సభను వాయిదా వేశారు. ఈ తరహా పార్లమెంటరీ విధానం ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తోందని జగదీప్ దంఖర్ వ్యాఖ్యానించారు.