పంట నష్టానికి కారణమైన వ్యక్తికి మూడు నెలల జైలు

by Shiva |
పంట నష్టానికి కారణమైన వ్యక్తికి మూడు నెలల జైలు
X

దిశ, ఝరాసంగం: అక్రమంగా భూమిలోకి ప్రవేశించి పంటను దున్ని పంట నష్టానికి కారణమైన వ్యక్తికి మూడు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధించిన ఘటన ఝరాసంగం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం 2017 జూన్ 6 న మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, ఝరా సంగం మండలం ప్యాలవరం గ్రామానికి చెందిన పట్లోల వీరన్న గ్రామ శివారులో గల వ్యవసాయ పొలంలోకి అక్రమంగా ప్రవేశించి పంటను దున్ని నష్ట పరిచాడు.

దీంతో బాధితుడు ఝరాసంగం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో నాటి ఎస్సై లవకుమార్ కేసు నమోదు చేసి న్యాయస్థానంలో చార్జ్ షీట్ దాఖలు చేశాడు. దంతో జహీరాబాద్ సివిల్ కోర్టు జడ్జ్ అనూష కేసు యొక్క పూర్వాపరాలు పరిశీలించి సోమవారం నేరస్థుడికి 3 నెలల జైలుశిక్ష, రూ.వేయి జరిమానా విధించినట్లు ఝరాసంగం ఎస్సై రాజేందర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story