- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగ్గురు ఆయుష్ సిబ్బందిని విధుల నుండి తొలగింపు
దిశ, కొల్చారం : ఆగస్టు 31వ తేదీన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆరోజు ఆసుపత్రిలో ఆయుష్ విభాగం వైద్యాధికారి డాక్టర్ హర్ష ,కాంపౌండర్ జి. రజిత, అటెండర్ పెంటయ్యలు ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. దీంతో ఈ ముగ్గురిని విధుల నుండి తొలగించాలని డి ఎం అండ్ హెచ్ ఓ కు కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు వీరితో పాటు వీధులకు హాజరుకాని వైద్య ఆరోగ్యశాఖ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గౌడ్ ను సస్పెన్షన్ చేయాలని కలెక్టర్ ఆదేశించడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు డిఎం అండ్ హెచ్ ఓ శ్రీరామ్ సోమవారం ఆయుష్ విభాగానికి చెందిన వైద్యాధికారి హర్ష కాంపౌండర్ రజిత అటెండర్ పెంటయ్యలను విధులను తొలగిస్తూ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గౌడ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వీరితోపాటు వైద్యాధికారి డాక్టర్ రమేష్ కు షోకాజ్ నోటీసుల ను డిఎం అండ్ హెచ్ ఓ శ్రీరామ్ సోమవారం అందజేసీనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ద్వారా తెలిసింది.