కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..

by Naresh |   ( Updated:2023-10-27 18:03:24.0  )
కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఎన్నికల సంగ్రామం ఊపందుకుంటోంది. అధికార బీఆర్ఎస్ కు ధీటుగా అభ్యర్థుల ఖరారుపై కసరస్తు చేసిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు సిద్దిపేట జిల్లాలో హస్తం గుర్తు పై పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారు చేశారు. సిద్దిపేట జిల్లాలో నాలుగు నియోజక వర్గాలకు గాను మొదటి జాబితాలో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం హస్తం టికెట్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డికి కేటాయించగా, తాజాగా విడుదల చేసిన రెండవ జాబితాలో సిద్దిపేట అసెంబ్లీ నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పూజల. హరికృష్ణ, దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు. శ్రీనివాస్ రెడ్డి, హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం. ప్రభాకర్ లకు హస్తం పార్టీ టికెట్ ఖరారు చేసింది. జిల్లాలోని నాలుగు నిమోజక వర్గాల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించగా, మరో రెండు బీసీ సామాజిక వర్గానికి కేటాయించారు. దుబ్బాక కాంగ్రెస్ టికెట్ బీఆర్ఎస్ దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణ అనంతరం జరిగిన ఉప ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున బరిలో నిలిచిన చెరుకు శ్రీనివాస్ రెడ్డికే తిరిగి టికెట్ కేటాయించగా, హుస్నాబాద్ టికెట్ సామాజిక సమీకరణాల్లో భాగంగా కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వైపు మొగ్గు చూపగా, సిద్దిపేట టికెట్ అనూహ్యంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ పూజల. హరికృష్ణ కు కేటాయించడం విశేషం.



చెరుకు శ్రీనివాస్ రెడ్డి (దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి )

తండ్రి : మాజీ మంత్రి స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డి

చదువు : ఎంబీఎ

భార్య: చెరుకు అర్పిత

పిల్లలు: నేహ, రేవల్ రెడ్డి

సామాజిక వర్గం : రెడ్డి

2020 లో దుబ్బాక నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.





పొన్నం. ప్రభాకర్ (హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి )

చదువు : ఎం.ఏ , ఎల్ ఎల్ బీ

భార్య : పొన్నం మంజుల

పిల్లలు : ప్రణవ్, పృథ్వీ,

సామాజిక వర్గం : గౌడ

కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2009 -14 మధ్య 15వ లోక్‌సభకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.

కరీంనగర్ లోక్ సభ నుంచి ఎన్నుకోబడిన ఎంపీలలో ఇతడే చిన్న వయస్కుడు.



పూజల. హరికృష్ణ (సిద్దిపేట కాంగ్రెస్ అభ్యర్థి )

చదువు : ఎంఎ, ఎల్ఎల్ బీ

భార్య : శైలజ

పిల్లలు : విక్రమాదిత్య,

సామాజిక వర్గం : మున్నూరు కాపు

టీపీసీసీ జనరల్ సెక్రటరీ

Advertisement

Next Story

Most Viewed