- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లాలో పెద్ద సంఖ్యలో ఆయిల్ ఫాం తోటలు
దిశ,చౌటకూర్ : జిల్లాలో పెద్ద సంఖ్యలో ఆయిల్ ఫాం తోటలు సాగు చేస్తున్నారని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. సర్వేపల్లి గ్రామ శివారులో రైతు కరణం హనుమంతరావు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ తోటను సంగుపేట్ ఏరువాక కేంద్రం సమన్వయ కర్త కె.రాహుల్ విశ్వకర్మ, వ్యవసాయ శాస్త్రవేత్తలు కె.సరిత గురువారం క్షేత్ర సందర్శనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యానవన శాఖ ప్రోత్సాహంతో రైతులు విరివిగా ఆయిల్ ఫామ్ తోటను సాగు చేస్తున్నారని, ఇందులో భాగంగానే సర్వేపల్లి లో కూడా ఆయిల్ ఫామ్ తోటను సాగు చేస్తామని పేర్కొన్నారు.
మొదటి ఏడాది మొక్కను కాపాడుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఈ పంటకు కొమ్మ పురుగు వ్యాప్తి చెంది నష్ట పరుస్తుందని, ఈ పురుగు తెల్లని అండాకారము గల గుడ్డు రెండు నుంచి 6 అంగుళాలు కలిగి ఉంటుందన్నారు. లోతులో, తేమగల ప్రాంతాలలో, పడిపోయిన చెట్టు మొదళ్లలో పెట్టి సంతానాన్ని ఉత్పత్తి చేసుకుని పెద్ద పురుగులా మారి మొవ్వ ప్రాంతంలో వ్యాపించి చెట్టును నాశనం చేస్తుందన్నారు. దీని నివారణకు కొమ్ము పురుగును ఆకర్షించు రైనోల్లూర్ ఆను ఫెరమోస్ ఎరలు బకెట్టో పెట్టి ఐదెకరాల తోటకు ఒకటి చొప్పున ఉంచి, ఆకర్షితమైన తల్లి పురుగును నాశనం చేయాలని సూచించారు. అదే విధంగా వేప పిండిని చెట్టు మొదళ్లలో చెట్టుకు 100 గ్రాముల తో పాటు 50 గ్రాములు ఇసుకలో కలిపి చల్లాలన్నారు. తోట పరిసర ప్రాంతాల్లో పడిపోయిన చెట్టును తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైపీఐ శ్రీకాంత్, రైతు కర్ణం హనుమంతు పాల్గొన్నారు.
- Tags
- oil farm