- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాబోయే పార్లమెంట్ ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించాలి
దిశ, సంగారెడ్డి : భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రాబోయే పార్లమెంట్ ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం హౌస్ ఆఫ్ పార్లమెంట్‌కు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ… ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలలో అమలు చేయాలని, దానికి తగిన విధంగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ టర్న్ ఔట్ పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని, జిల్లాలో ఉన్న విద్యా సంస్థల్లో ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్బులు ప్రారంభించి ఓటు ప్రాముఖ్యత గురించి వివరించాలని, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, జిల్లాలోని ప్రముఖులను గుర్తించి వారిచే ఓటు ప్రాముఖ్యత పై అవగాహన వీడియోలు రూపొందించాలని అన్నారు.
ఓటరు జాబితాలో వచ్చే మార్పులపై ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తూ వారికి సమాచారం అందించాలని, రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశపు మినిట్స్ కాపీలను ఆన్ లైన్‌లో నమోదు చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. నూతన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, నూతనంగా మంజూరు చేసిన ఓటర్ కార్డు వివరాలను వెంటనే సంబంధిత ప్రింటర్లకు అందజేయాలని అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ మాధురి, డీఆర్ఓ పద్మజారాణి, ఆర్డీఓలు పాండు , రాజు, వసంత కుమారి తదితరులు పాల్గొన్నారు.