- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దొంగగా మారిన టీచర్.. బ్యాంక్ చుట్టూ ఖాళీ చెక్కులతో తిరుగుతూ చోరీ..!
దిశ, కంది: అతడు ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. నీతి పాఠాలు నేర్పించాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ.. పిల్లలకు మంచి పాటలు బోధించేది మానేసి టీచర్ దొంగగా మారాడు. మంచి ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బతకాల్సిన ఆ ఉపాధ్యాయుడు ఆ వృత్తికి కళంకాన్ని తెచ్చిన వైనం సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ రమణ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 10న మధ్యహ్నం కొన్యాల రాములు అనే వ్యక్తి సంగారెడ్డిలోని ఎస్‌బీఊ మెయిన్ బ్రాంచ్ నుండి డబ్బులు డ్రా చేసుకుని.. తన భార్యతో కలిసి మోటార్ సైకిల్‌పైన ఇంటికి వెళ్తున్నారు.
పోతిరెడ్డి పల్లి సమీపంలో రోడ్ పక్కన మోటార్ సైకిల్ పార్క్ చేసి కూరగాయల కోసం వెళ్లారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి మోటార్ సైకిల్‌పై వచ్చి అతని వద్ద ఉన్న ఒక లక్ష యాభై వేలు సంచిని లాక్కొని పోయాడు. అదే రోజు రాములు సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రత్యేక టీమ్‌లో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు సార సంతోష్ (38) ఎంపీపీ స్కూల్‌లో పని చేస్తున్న ఉద్యోగిగా గుర్తించారు. ఇక అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని ఒప్పుకున్నాడు.
అంతేకాక తన మోటార్ సైకిల్ నెంబర్ ప్లేట్‌ను మలిచాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా ఖాళీ చెక్‌లను పట్టుకొని బ్యాంకుల చూట్టు తిరుగుతూ.. బ్యాంకులో డబ్బులు ఎవరు డ్రా చేస్తుంది గమనించి వారిని వెంబడించి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అయితే గతంలో మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు సస్పెండ్ అయినట్లు కూడా తెలిసింది. నిందితుడిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును రూ.1,50,000 స్వాధీనము చేసుకొని, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.