మహిళ మెడలో వాటిని అపహరణ!

by Web Desk |
మహిళ మెడలో వాటిని అపహరణ!
X

దిశ, జగదేవపూర్: మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు అపహరించిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా, రాజపేట మండలం సింగారం గ్రామానికి చెందిన వంపు రేణుక, భర్త మహేందర్ లు బుధవారం మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో జరిగిన బొడ్రాయి పండుగ ప్రతిష్ట మహోత్సవానికి బంధువుల ఇంటికి వెళ్లారు. గురువారం సాయంత్రం ఇద్దరు తిరిగి స్వగ్రామం సింగారం కు భర్త మహేందర్ తో కలసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మునిగడప, వట్టిపల్లి గ్రామల మధ్యలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రేణుక మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Advertisement

Next Story