- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీఆర్ఎస్ అస్తికలు గోదావరిలో కలపడం తథ్యం
దిశ, హుస్నాబాద్: ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కనుక డిసెంబర్ 3 వ తేదీన వెలువడే ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం తధ్యమని తీన్మార్ మల్లన్న అన్నారు. బీఆర్ఎస్ అస్తికలు గోదావరిలో కలపడం కాయమని అభివృద్ధి అంటూనే హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే , బీఆర్ఎస్ అభ్యర్థి ఒడితల సతీష్ కుమార్ 9 సంవత్సరాలు సర్వనాశనం చేశారని తీన్మార్ మల్లన్న( చింతపండు నవీన్) అన్నారు. ఆదివారం మల్లె చెట్టు చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో కలిసి కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.... రైతులకు అద్భుతమైన పథకాలు ప్రవేశపెడుతున్నామని ప్రగల్బాలు పలుకుతున్న కేసీఆర్ బ్రతికున్నప్పుడు రావాలిగాని చచ్చిన తర్వాత వస్తే లాభం ఏంటి అని ప్రశ్నించారు. పేద వాళ్లకు డబుల్ బెడ్ రూములు కట్టిస్తానని చెప్పి మోసం చేసిన కేసీఆర్‌కు తగిన గుణపాఠం తప్పదని అన్నారు. రైతులకు ఉచిత కరెంటు అందిస్తున్నామని ఒకవైపు చెబుతూనే మరోవైపు వినియోగదారులపై అధిక కరెంటు బిల్లుల భారం మోపి నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒకటవ తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటవ తేదీన జీతాలు చెల్లించి ఆదుకుంటామని తెలిపారు.
సెంటిమెంట్ పేరుతో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాల బాగు చేశానని చెప్తున్న సతీష్ కుమార్ భ్రష్టు పట్టించారని ప్రక్కనున్న సిద్ధిపేట, గజ్వేలు నియోజకవర్గాలు అభివృద్ధి చెందినట్లు హుస్నాబాద్ ను ఎందుకు అభివృద్ధి చేయలేదని అన్నారు. అసెంబ్లీలో సతీష్ కుమార్ ఎప్పుడైనా మాట్లాడారా? కనీసం ప్రజల సమస్యలపై గొంతు ఎత్తారా? అని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రం కోసం పెప్పర్ స్ప్రే పడినా లెక్కచేయకుండా పార్లమెంటులో గొంతెత్తి తన వాణి వినిపించారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఎంత ధృఢంగా ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాల్సి అవసరం ఉందని మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనమని , కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా కాంట్రాక్టులకు కోట్లు కట్టబెట్టారని దీని ద్వారా ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. భూములకు ధరలు పెరిగాయని చెప్తూనే గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు చెల్లించిన పరిహారం చాలా తక్కువ అని అన్నారు. భూ నిర్వాసితుల భూములకు ధరలు తక్కువ ఇచ్చిన కేసీఆర్ , ఫామ్ హౌస్ దగ్గర ఉన్న భూమిని ఐదు లక్షలకు ఎకరం చొప్పున ఇస్తావా అని ప్రశ్నించారు. భూ నిర్వాసితులను బేడీలు వేసి జైలుకు పంపించి ఆడబిడ్డలను అరిగోస పెడుతున్న ఘనత కేవలం సతీష్ కుమార్ కే దక్కుతుందని , ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రజలకు పెడుతున్న దండం హుస్నాబాద్ ప్రజలకు ప్రాణగండమని అన్నారు. అన్ని విధాల సమర్థుడు ఉద్యమ నాయకుడు పొన్నం ప్రభాకర్ ను 50వేల మెజారిటీతో గెలిపించాలని అన్నారు.