PACS Chairman : మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఓటర్లను ప్రలోభ పెట్టి అధికారంలోకి..

by Sumithra |   ( Updated:2024-08-11 10:13:51.0  )
PACS Chairman : మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఓటర్లను ప్రలోభ పెట్టి అధికారంలోకి..
X

దిశ, కోహెడ : రాహుల్ గాంధీ గ్యారెంటీ, రేవంత్ గ్యారెంటీ అని ఆరు హామీలతో ఎన్నికల్లో పోటీ చేసి అత్యధికంగా మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగా ప్రతి మహిళకు నెలకి 2500 చొప్పున ఇస్తాను అని ముఖ్యమంత్రి ఎన్నికల వాగ్దానం చేసి, ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొమ్మిది నెలలు అవుతున్నా ఇంతవరకు ఒక్క మహిళకు కూడా మహాలక్ష్మి పథకం కింద డబ్బులు ఇవ్వలేదన్నారు. గద్దెనెక్కేవరకు ఒక మాట, గెలిచాక మరో మాట. కొత్త ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతున్నా, పరిపాలన కన్నా ఢిల్లీ పెద్దల ప్రసన్నం చేసుకోవడం పైనే కాంగ్రెస్ పాలకుల దృష్టి ఉన్నదన్నారు.

తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు ప్రాధాన్యం ఇస్తాం అని చెప్పుకున్న కాంగ్రెస్ నాయకులు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఇప్పటివరకు మహిళలకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చే పనులు చేయలేదన్నారు. కనీసం కేబినెట్ మీటింగ్ లో కానీ, అసెంబ్లీ సమావేశాలలో కానీ మహాలక్ష్మి పథకం ప్రస్తావన కూడా చేయకపోవడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ అక్కాచెల్లెల్లు అందరికీ వెంటనే ప్రతినెల 2500 రూపాయలు ఇవ్వాలి, లేదంటే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేసి కాంగ్రెస్ పాలకులకు కనువిప్పు కలిగిస్తామని పీఏసీఎస్ చైర్మన్ పెర్యాల దేవేందర్రావు హెచ్చరించారు.

Advertisement

Next Story