మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

by Shiva |
మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
X

దిశ, సంగారెడ్డి: దేశంలో బీజేపీ పాసిస్ట్ పాలనను కనసాగిస్తున్న మతోన్మాద బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్ లో ఉమ్మడి జిల్లా సీపీఐ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో లాభాల్లో ఉన్న కంపెనీలను ప్రధాని మోదీ అమ్ముతూ బడా బాబులకు లాభాలు చేకూర్చుతున్నారని ఆరోపించారు.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలపై భారం మోపుతూ వారిని పూర్తిగా కష్టాల్లోకి నెట్టారని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం వల్ల సమాన్యుడు బతికే రోజులు లేవని ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీల నాయకులపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించిన రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా ఇల్లు ఖాళీ చేయాలని సర్క్యులర్ ఇవ్వడం చాలా దుర్మార్గమన్నారు.

ప్రశ్నించినందును ప్రతిపక్షాలను లేకుండా చేయాలనే ఉద్దేశంతో దేశంలోని తొమ్మది రాష్ట్రాల్లో బీజేపీ అక్కడున్న ప్రభుత్వాలను కూల్చి వేసిందని ఆరోపించారు. మతోన్మాద బీజేపీని గద్దె దింపితేనే దేశం బాగుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా రాష్ట్రంలో టీఎస్ఫీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

పేపర్ లీకేజీతో నష్టపోయిన విద్యార్థులకు ప్రభుత్వమే కోచింగ్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకుడు ప్రకాశ్ రావు, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జలాలుద్దీన్, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, మెదక్ జిల్లా కార్యదర్శి టీఎం.ఖాలేక్, మహబూబ్ ఖాన్, ఎం.ఏ.రహమాన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed