గుమ్మడిదలలో ఉద్రిక్తత

by Kalyani |
గుమ్మడిదలలో ఉద్రిక్తత
X

దిశ, గుమ్మడిదల :- గుమ్మడిదలలో గురువారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా సిపిఐ కార్యదర్శి కాలిక్ లక్ష్మాపూర్ గ్రామస్తుల తరఫున నిరసన తెలుపుతుండగా పోలీసులు అరెస్టు చేసి గుమ్మడిదల పోలీస్ స్టేషన్ కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మాపూర్ భూములను పేదలకు పంచాలని గత కొన్ని రోజులుగా గ్రామస్తులు సిపిఐ నాయకులు పోరాటం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మెదక్ జిల్లా సిపిఐ కార్యదర్శి కాలిక్ సుమారు 500 మంది లక్ష్మాపూర్ గ్రామస్తులతో కలిసి మండలంలో ర్యాలీతో నిరసన నిర్వహిస్తుండగా.. పోలీసులు ఆయనను అరెస్టు చేసి గుమ్మడిదల పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సీఐ నాయుముద్దీన్ గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్ రెడ్డి పోలీసుల బృందం ఆందోళన నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసి మరో పోలీస్ స్టేషన్ కు తరలించి.. పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.

Advertisement

Next Story

Most Viewed