సంక్షేమ పథకాల్లో అగ్రస్థానం తెలంగాణదే : ఎమ్మెల్యే మాణిక్ రావు

by Shiva |
సంక్షేమ పథకాల్లో అగ్రస్థానం తెలంగాణదే : ఎమ్మెల్యే మాణిక్ రావు
X

దిశ, జహీరాబాద్: సంక్షేమ పథకాల అమల్లో అగ్రస్థానం తెలంగాణదేనని ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. జహీరాబాద్ పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్స్ హాల్లో నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజాప్రనిధుల సభలో ఆయన పార్టీ జెండాను ఎగురవేసి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా ప్లీనరీ సమావేశాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణక్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ భవిష్యత్తు ప్రణాళికతో తాగునీరు, సాగునీరు, విద్యుత్‌ సమస్యలు పూర్తిగా తీరిపోయాయని అన్నారు. రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలను పక్క రాష్ట్రాల వారు కూడా అనుసరించే స్థాయికి తెలంగాణ చేరిందన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలు దేశానికి ఆదర్శమన్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీకి వస్తున్న ఆదరాభిమానాలు చూస్తుంటే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమనే విశ్వాసం కలుగుతోందన్నారు. పార్టీ అధ్యక్షులు హుగ్గేల్లి రాములన్న ఇతర నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందన్నారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో మరెక్కడా ఏ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed