- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశంలో ఇంటింటికీ తాగునీరిచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ : ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
దిశ, కొండపాక: దేశంలో ఇంటింటికీ తాగునీరిచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం కుకునూర్ పల్లి మండలం తిప్పారంలో ఏర్పాటు చేసిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుంచి మంగోల్ నీటి శుద్ధికరణ కేంద్రానికి రా వాటర్ సరఫరా చేసే పంపుల ట్రయల్ రన్ కార్యక్రమాన్ని మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రూ.1,212 కోట్లతో తాగునీటి వసతి చేపట్టామని, 1,900 అవాసలకు, 9 నియోజకవర్గాలోని 16 మున్సిపాలిటీలకు ఈ ప్లాంట్ ద్వారా తాగునీరందనుంది పేర్కొన్నారు. మిషన్ భగీరథ దేశంలోనే తెలంగాణకు మకుటాయమానంగా నిలుస్తోందన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని అని వర్షపు నీళ్లను ఫిల్టర్ చేసి ఇంటింటికీ నీరందిస్తే.. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు బోర్లు వేసి నిరందిస్తున్నారని తెలిపారు.
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దేశంలోనే ప్రతిరోజూ 540 MLD సామర్థ్యంతో నీటి విడుదల చేశాం అని తెలిపారు. అందుకోసం లెటెస్ట్ టెక్నాలజీ, ఈక్విప్ మెంట్ వాడుతున్నమని తెలిపారు. ఈ రోజు 50 శాతం ట్రయల్ రన్ చేపట్టమని పేర్కొన్నారు. మానవులు నిర్మించిన అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్ అని ఇది ఏడు జిల్లాలు, 10 నియోజకవర్గాలోని 1,922 గ్రామాలకు నీటి సరఫరా అవుతోందన్నారు. ఇప్పటి వరకు 300 మిలియన్ లీటర్లు నీరు సరఫరా అవుతుండగా, ఇప్పుడు మరో 300 మిలియన్ లీటర్ల నీటి సరఫరాకు అవకాశం ఏర్పడిందన్నారు.
భవిష్యత్ లో పెరిగే హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా తాగు నీటి సరఫరాకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నడని సహకారం అందించనది మేము కాదాని.. కేంద్రమేనని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎంవో కార్యదర్శి స్మిత సభర్వాల్, జడ్పీ చైర్మన్ వేలేటి రోజారాధ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఏఫ్డీసీ చైర్మన్ వంటేర్ ప్రతాప్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, డీసీసీబీ బ్యాంకు చైర్మెన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఎంపీపీ ర్యాగల్ల సుగుణ దుర్గయ్య, వైస్ ఎంపీపీ దేవి రవీందర్, ఎన్ఈజీఎస్ స్టేట్ కో ఆర్డినేటర్ కోల సద్గుణ రవీందర్, సర్పంచ్ లు పూలోజీ కిరణ్ కుమార్, బచ్చలి మహిపాల్, అమ్మలు రమేష్, అనంతుల ప్రశాంత్, నూనె కుమార్ యాదవ్, అంబటి బాలచందర్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: ఇక చూసుకుందాం.. 2023 ఎన్నికల్లో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను: పొంగులేటి