నామినేషన్ దాఖలు చేసిన హేమాహేమీలు

by Sumithra |   ( Updated:2023-11-09 07:17:14.0  )
నామినేషన్ దాఖలు చేసిన హేమాహేమీలు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరానికి హేమాహేమీలంతా సన్నద్దమవుతున్నారు. ఈనెల 3వ తేది నుండి నామినేషన్ల ప్రారంభమైన నాటి నుండి ప్రధాన పార్టీల్లో టికెట్ ఖరారైన అభ్యర్థులతో పాటుగా ఆశావాహులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ల వేశారు. గురువారం మూహుర్తం ఉండటంతో నామినేష్ల ప్రక్రియ ఊపందుకుంది. గజ్వేల్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, సిద్దిపేటలో మంత్రి తన్నీరు హరీష్ రావు నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయం మంత్రి తన్నీరు. హరీష్ రావు కొండగట్టు అంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. సిద్దిపేటకు చేరకున్న హరీష్ రావు పట్టణంలోని మోహిన్ పుర వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఈద్గాలో, చర్చ్ లో ప్రార్థనల్లో పాల్గొని, సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుండి హెలికాప్టర్ బయలుదేరి నేరుగా గజ్వేల్ కు చేరుకొని గజ్వేల్ ఐఓసీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 4న సెంటిమెంట్ కొనాయిపల్లి వేంకటేశ్వర స్వామి దేవాయలంలో నామినేషన్ పత్రాలను సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులు ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవాలయ ప్రాంగణంలోనే నామినేషన్ పత్రాల పై సంతాకాలు చేసిన విషయం విధితమే.

Advertisement

Next Story

Most Viewed