- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించాలి : సిద్దిపేట కలెక్టర్
దిశ, సిద్దిపేట అర్బన్ : ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ఇందిరమ్మ కమిటీ సిబ్బందిని ఆదేశించారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల సర్మేను కలెక్టర్ మను చౌదరి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా వివరాల నమోదు చేయాలన్నారు.
ఇంటి స్థలం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు లు పరిశీలించుకుని అవి సరైనవని ధృవీకరించుకున్న తరువాతే యాప్ లో నమోదు చేయాలని అన్నారు. గ్రామాల్లో మున్సిపాలిటీ లలో అర్హులైన ప్రతి ఓక్కరు ఈ సర్వేలో నమోదు చేసుకునే విధంగా ప్రజలను చైతన్య పరచాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈకార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ సలీం, ఎంపీడీఓ సూపర్వైజర్లు, సర్వే సిబ్బంది తదితరులు హాజరయ్యారు.