- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కసితో కూడిన లక్ష్యం ఉన్న వారికే విజయం
దిశ , జహీరాబాద్: కసితో కూడిన లక్ష్యం ఉన్న విద్యార్థులకే ఎంతటి విజయమైన వరిస్తుందని సంగారెడ్డి ఎస్పీ. రూపేష్ అన్నారు. సోమవారం పట్టణంలోని పీవీఆర్ గార్డెన్స్‌లో డిగ్రీ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ చెన్నూరి రూపేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జీవితంలో స్థిర పడేంత వరకు ప్రేమ పెళ్లిళ్లు పేరుతో స్పాయిల్ చేసుకోరాదన్నారు. సరస్వతిని నమ్మినవారికి లక్ష్మి కటాక్షం తప్పకుండా వర్తిస్తుందన్నారు. ట్రాఫిక్ రూల్స్ ప్రయాణికులకు రక్ష కోసమేనన్నారు. ఫోక్సో చట్టం పై అవగాహన కల్పిస్తూ జరగబోయే పరిణామాల పై విద్యార్థులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి , జీవితం, ఉద్యోగంలో, విధి నిర్వహణలో స్వయ అనుభవాలు, కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తూ విద్యార్థులకు చట్టాలు, జీవిత లక్ష్యం వైపు నడిపారు. అనంతరం వారి ప్రశ్నలకు సానుకూలంగా సమాధానం చెప్పారు. అడిషనల్ ఎస్పీ. డాక్టర్ పి. అశోక్, డీఎస్పీ. రఘులు మాట్లాడుతూ… సైబర్ మోసాలు, డ్రగ్స్ ఎఫెక్ట్స్, పోక్సో యాక్ట్, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. కంప్యూటర్లు, నెట్‌వర్క్‌లు , ఇంటర్నెట్‌ని ఉపయోగించి నిర్వహించే నేర కార్యకలాపాల పట్ల యువతను అప్రమత్తం చేశారు. హ్యాకింగ్ తదితర ఆన్‌లైన్ మోసాలపట్ల తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. నెంబర్.1930, 100 తదితర హెల్పలైన్ లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సైబర్ బెదిరింపు వంటి అనేక రకాల చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎలా ఎదుర్కోవాలో సూచించారు. ఫొటోల షేరింగ్, క్యూఆర్ స్కానింగ్, ఈ కామర్స్‌ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
Read More..
రామగుండం పోలీస్ కమిషనర్‌గా శ్రీనివాసులు