పరిశ్రమ సహాయంతో తూప్రాన్ రెసిడెన్షియల్‌లో గణనీయ మార్పులు : కలెక్టర్ రాహుల్ రాజ్

by Aamani |
పరిశ్రమ సహాయంతో తూప్రాన్ రెసిడెన్షియల్‌లో గణనీయ మార్పులు : కలెక్టర్ రాహుల్ రాజ్
X

దిశ,తూప్రాన్ : పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన బాధ్యతగా చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం తూప్రాన్ లోని గురుకుల పాఠశాలలో ఐటీసీ పరిశ్రమ సహకారంతో నిర్మించిన లైబ్రరీ భవనం స్టడీ రూమ్ భవనాలను ఆయన ప్రారంభించారు. గురుకుల పాఠశాల లో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పరిశ్రమ సహకారం అందించడం అభినందనీయం అన్నారు.తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల లో ఐటీసీ కంపెనీ వారు కట్టిన స్టడీ హాల్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు.

గత ఫిబ్రవరి నెలలో రవాణా, బీసీ శాఖ పొన్నం ప్రభాకర్ ఆకస్మిక సందర్శన లో , రెసిడెన్షియల్ స్కూల్ లో పరిస్థితులను స్వయంగా పరిశీలించి , అప్పటికప్పుడు విద్యార్థుల తాగునీటి కోసం ప్రిన్సిపాల్ కిరూ. 50 వేలు తాను స్వయంగా ఇచ్చి , రెండవ ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చేయించారు. అంతేగాక స్థానిక ఆర్డిఓ జయ చంద్ర రెడ్డి తో అప్పటి జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో మాట్లాడి ఇక్కడి స్థానిక కంపెనీ ల సహాయం ఇతర సమస్యలను పరిష్కరించాలని సూచించారు. దీనికి ప్రతిస్పందనగా ఐటీసీ కంపెనీ వారు రూ. 25 లక్షల తో తామే స్వయంగా స్టడీ హాల్, లైబ్రెరీ ని నిర్మించారు. దానిని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్థానిక మున్సిపల్ చైర్మన్, ఆర్డీఓ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్ర రెడ్డి,ఐటీసీ డిప్యూటీ సెక్రటరీ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ , మున్సిపల్ కమిషనర్ ఖాజా పాషా, తహసీల్దార్ విజయలక్ష్మి. తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story