- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు: టీఎస్.హెచ్.డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్
దిశ, సంగారెడ్డి: రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లని తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో బీఆర్ఎస్ ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ ప్లీనరీలో చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోరాటం చేశారని కొనియాడారు. కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం దారపోసేందుకు సిద్ధమయ్యాడని, ఆయన పోరాటం ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు.
నీళ్లు, నిధులు, నియామకాలు కోసం సాగిన పోరాటంతో స్వరాష్ట్రంలో దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకెళ్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అన్ని రాష్ట్రాలు తెలంగాణ పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయన్నారు. ఉందన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు, మిషన్ కాకతీయతో చెరువుల ద్వారా వ్యవసాయానికి సాగునీరు, చేపల పెంపకం, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు.
ఈ సందర్భంగా ప్లీనరీలో 11 అంశాలపై తీర్మాణాలు చేశారు. మొదటగా వ్యవసాయ రంగంపై సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మైనార్టీ సంక్షేమం ఎం.ఏ.హాకీం, సామాజిక భద్రత గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, మహిళా సంక్షేమం సదాశివపేట మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మీ, బీసీ సంక్షేమం డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, పల్లెప్రగతి-పట్టణ ప్రగతి కంది జడ్పీటీసీ కొండల్ రెడ్డి, గిరిజన సంక్షేమం మోహన్ నాయక్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరిండం ఆపాలని, దళిత సంక్షేమం బీఆర్ఎస్ సంగారెడ్డి మండల మాజీ అధ్యక్షుడు అశోక్, విద్యా,ఉద్యోగ జలేందర్ రావు, కేంద్రంలో ఉన్న మోడీ బీజేపీ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పలు తీర్మాణాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ తీర్మాణాలను రాష్ట్ర ప్లీనరీకి పంపించనున్నట్లు చింతా ప్రభాకర్ తెలిపారు. ఈ ప్లీనరీలో సంగారెడ్డి జడ్పీటీసీ సునీతా మనోహర్ గౌడ్, కంది ఎంపీపీ సరళా పుల్లారెడ్డి, సదాశివపేట ఎంపీపీ తొంట యాదమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మాజీ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, కౌన్సిలర్ పులిమామిడి రాజు, సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ లత విజయేందర్ రెడ్డి, కౌన్సిలర్ జీ.వీ.వీణ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు రషీద్, డాక్టర్ శ్రీహరి, మనోహర్ గౌడ్, లలిత, మల్లాగౌడ్, చిల్వేరి ప్రభాకర్, దిడ్డి విఠల్, ఆత్మకూర్ ఎంపీటీసీ సత్యనారాయణ, వెంకటేశ్వర్లు నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.