- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారులెక్కడ..? పెద్దకంజర్ల వైపు చూడరా..?
అది కన్జర్వేషన్ జోన్.. అక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరు. నిబంధనల ప్రకారం ఎలాంటి గృహ నిర్మాణాల లే ఔట్లు నిర్మించడానికి వీలు లేదు. అయినా ప్రభుత్వ నిబంధనలకు పాతర వేస్తూ వెంచర్ నిర్మిస్తున్నారు కొందరు రియల్టర్లు. అనుక్కున్నదే తడవుగా చకా చకా నిర్మాణ పనులు మొదలెట్టారు. ఎవరికీ కనిపించకుండా భూమి చుట్టూ ప్రహరీ గోడను ఏర్పాటు చేశారు. మొత్తం భూమిని చదను చేసి రోడ్లు వేశారు. అంతర్గత మురుగు నీటి కాల్వల పనులు మొదలు పెట్టారు. ఇంతా జరుగుతున్నా ఆ వెంచర్ వైపు అధికార యంత్రాంగం కన్నెత్తి కూడా చూడడం లేదు. పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల పంచాయతీ పరిధిలో అక్రమ వెంచర్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం గ్రామంలోని భూములు కన్జర్వేషన్ జోన్ పరిధిలో ఉన్నాయి. సర్వే నెంబర్లు 96,97 లలో సుమారు 14 ఎకరాల్లో వెంచర్ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్ నిర్మాణం జరుగుతున్నా అధికారులు అక్కడ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
దిశ, పటాన్ చెరు: పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల పంచాయతీ పరిధిలో అక్రమ వెంచర్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం గ్రామంలోని భూములు కన్జర్వేషన్ జోన్ పరిధిలో ఉన్నాయి. సర్వే నెంబర్లు 96,97లలో సుమారు 14 ఎకరాల్లో వెంచర్ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. అయితే సర్వే నెంబర్లు 96,97లలో సుమారు 14 ఎకరాలలో వెంచర్ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఈ ప్రాంతంలో ప్లాట్లు చేయడానికి వీలు లేకపోవడంతో గుంటలు, గుంటలుగా అమ్మకాలు జరిపి రిజిస్ట్రేషన్ లు పూర్తి చేశారు. ప్రస్తుతం వెంచర్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. వెంచర్ చుట్టూ ప్రహరీని నిర్మించి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పూర్తికావచ్చింది. అయితే నిబంధనలకు తిలోధకాలు ఇస్తూ అక్రమ వెంచర్ నిర్మాణం జరుగుతున్నా అధికారులు అక్కడ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
ఇక్కడ అన్నీ కామన్..
ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న సంబంధిత శాఖ అధికారులు పట్టించుకువడంలేదు. అధికారుల అలసత్వమే ఆయుధంగా అక్రమార్కులు తాము అనుకున్న పనిని సులువుగా పూర్తి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ధనార్జనే ధ్యేయంగా పనిచేసే రియాల్టర్లు యథేచ్ఛగా పని పూర్తి చేసుకుంటున్నారు. ఎవరైనా ఈ అక్రమ నిర్మాణాలపై ప్రశ్నిస్తే ఈ ప్రాంతంలో ఇదంతా కామన్ అనే విధంగా సమాధానాలు చెప్పడం విడ్డూరం. పైగా తమ నిర్మాణాలను ఎవరు ఆపలేరని తమ పని తాము పూర్తి చేసుకుని వెళ్తాము అన్న దర్జా ఇక్కడ వ్యాపారుస్తులలో విస్తరించిపోయింది. అక్రమ నిర్మాణాలపై ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండడంతో ఇదే అదునుగా అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. ప్రధాన రహదారి పక్కనే పెద్ద ఎత్తున వెంచర్ నిర్మాణ పనులు జరుగుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనుమతులు లేకుండా నడుస్తున్న అక్రమ వెంచర్ వ్యవహారంపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అధికారులు స్పందించడం లేదని మండిపడుతున్నారు. చర్యలు తీసుకోవడం మాట పక్కన పెట్టి కొందరు అధికారులు సదరు వెంచర్ నిర్వాహకులకు సహకరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇక్కడ ఎటువంటి నిర్మాణ పనులకు అనుమతులు లేకున్నా ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో దర్జాగా వెంచర్ నిర్మాణ పనులు సాగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకుని పెద్ద కంజర్లలో జరుగుతున్న అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై అధికారులను అడిగితే అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయా అంటూ తమకేం తెలియనట్లు ఎదురు ప్రశ్నలు వేయడం గమనార్హం.. ఆ విషయమే తమకు తెలియదని ఆ భూములను ఫార్మ్ ల్యాండ్స్ అనుకున్నామని, ఇంత వ్యవహారం నడుస్తుందా ఒకసారి వెళ్లి పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. రెవెన్యూ, పంచాయతీ శాఖలకు సంబంధించిన అధికారులని ప్రశ్నిస్తే విషయం తెలిసినప్పటికీ తమకేం తెలియనట్టు తప్పించుకునే యత్నం చేశారు.