- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసవిలో వన్య ప్రాణులకు ప్రత్యేక రక్షణ కల్పించాలి
దిశ, మెదక్ ప్రతినిధి: వేసవిలో వన్య ప్రాణులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా పోచారంలో ఉన్న వన విజ్ఞాన కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. 4.5 కిలో మీటర్లు సఫారీ వాహనంలో అటవీ ప్రాంతం తిరిగి జింకల ప్రత్యుత్పత్తి కేంద్రంను జింకలని, నెమళ్ళు, మనుబోతులు, పక్షులను, ఇతర అటవీ జంతువులను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వన్య ప్రాణులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని, జంతువులకు ఆహారం, త్రాగు నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. వన విజ్ఞాన కేంద్రం ఏర్పాటు, అటవీ విస్తీర్ణం, సందర్శకుల సమయ పాలన గురించి అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అటవీ జంతువులకు త్రాగు నీరు, ఆహారం , రక్షణ ఏ విధంగా ఇస్తారు అని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, హవేలీ ఘనపూర్ మండలం తహసీల్దార్ నారాయణ, అటవీ సెక్షన్ అధికారి శ్రావణ్ కుమార్, బీట్ ఆఫీసర్ ప్రసాద్ గౌడ్, అటవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.