సోయాబీన్ విత్తన బస్తాలు సీజ్

by Shiva |
సోయాబీన్ విత్తన బస్తాలు సీజ్
X

నిందితుడిపై అత్యవసర చట్టం కింద కేసు నమోదు

దిశ‌, జహీరాబాద్ : మొగుడంపల్లి మండల పరిధిలోని ధనాసిరి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 200 బస్తాల సోయా బీన్ విత్తనాలను సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, చిరాగ్ పల్లి ఎస్సై కాశీనాథ్ కలిసి వారి సిబ్బందితో సంయుక్తంగా దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన ఒగ్గు సిద్దన్న అనే వ్యక్తి జహీరాబాద్ లోని ఫర్టిలైజర్ దుకాణంలో కొనుగోలు చేసిన హీరా మోతి కంపెనీకి చెందిన 200 సోయాబీన్ విత్తనాల బ్యాగులను అనధికారికంగా నిల్వ చేసినట్లుగా గుర్తించారు.

నిందితుడిపై 6(ఏ) అత్యవసర సరుకుల చట్టం-1955 కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిల్వ చేసిన విత్తన బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అనధికారికంగా విత్తనాలను నిల్వ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా రైతులు కూడా సరైన లేబుల్, లాట్ నంబర్ ఉన్న విత్తనాలను బిల్ తో సహా కొనుగోలు చేయాలని సూచించారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు రాకుండా నివారించేందుకు నిరంతరం రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో వ్యవసాయ, పోలీస్ సిబ్బందితో కలసి చెక్ పోస్ట్ లలో తనిఖీలు చేపడుతున్నామని ఎస్సై కాశీనాథ్, వ్యవసాయాధికారి వినోద్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story