- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొండపాకలో టీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ.. షాక్ ఇచ్చిన పార్టీ సర్పంచ్
దిశ, కొండపాక: సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి సిర్సనగండ్ల సర్పంచ్ షాక్ ఇచ్చారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చేత సర్పంచ్ గుడెం లక్ష్మారెడ్డి జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఏర్పుల మల్లేషం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నచ్చక, టీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో మండలంలో రేవంత్ రెడ్డితో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీలో చేరుతానని వెల్లడించారు. ఆయనతో పాటుగా బీజేపీ జిల్లా సెక్రెటరీ బైరెడ్డి లీలావతి తన అనుచర వర్గంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కొండపాక మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్ర, విశ్వనాథ పల్లి గ్రామ సర్పంచ్ వాసరి లింగారావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొమ్ము మల్లికార్జున్, సోషల్ కోఆర్డినేటర్ పంజా చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ సిర్సనగండ్ల గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.