Siddipet Collector : వైద్య సేవలు అందించేలా వసతులు సిద్ధం చేయాలి

by Aamani |
Siddipet Collector : వైద్య సేవలు అందించేలా వసతులు సిద్ధం చేయాలి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : అత్యవసర సేవలతో పాటు వైద్య సేవలు అందించేందుకు వీలుగా అవసరమైన వసతులతో వెయ్యి పడకల ఆసుపత్రిని సిద్దం చేయాలని టీజీ ఎం ఐడీసీ ఇంజనీర్ల ను కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కేంద్రం ఎన్సాన్ పల్లి నూతనంగా నిర్మించిన వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించి, నిర్మాణం పూర్తయిన గదులను పరిశీలించారు.

ఆసుపత్రిలో మంజూరు అయినా వైద్యులు, వైద్య సిబ్బంది సంఖ్య, ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తున్నారు, తదితర వివరాలు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కే. కిషోర్ కుమార్ ను అడిగి తెలుసుకొని వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు ఉచిత సేవలు అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీజీ ఎంఐడీసీ ఈఈ శ్రీనివాస్, డీఈ విశ్వ ప్రసాద్ తదితరులున్నారు.

Next Story

Most Viewed