- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడుపాయల్లో అట్టహాసంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు
దిశ, పాపన్నపేట : దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా, జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో గురువారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో చంద్రశేఖర్ వనదుర్గామాతకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వనదుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి సుందరంగా తీర్చి దిద్దిన గోకుల్ షెడ్ లో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఆలయ పరిసరాలు హోరెత్తాయి. నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవానికి రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి విచ్చేసి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, వనదుర్గామాత ఈ ఏడు పాయల్లో కొలువుదీరడం మనమంతా చేసుకున్న పుణ్యమని పేర్కొన్నారు. భక్తుల ఇలవేల్పుగా.. కోరిన కోరికలు తీర్చి.. కొంగుబంగారంగా విరాజిల్లుతున్న వనదుర్గామాత తల్లి చల్లని ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తొలి రోజైన గురువారం పాడ్యమిని పురస్కరించుకొని వనదుర్గామాత బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ సిబ్బంది, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మండల నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రోజువారీగా అమ్మవారి రూపం..
మొదటి రోజు గురువారం పాడ్యమిని పురస్కరించుకొని బాలా త్రిపుర సుందరి (ముదురు పసుపు) రూపంలో వన దుర్గమ్మ దర్శనమిచ్చింది. 4న గాయత్రీ దేవిగా (గులాబి), 5న అన్నపూర్ణ దేవిగా (నీలం), 6న వనదుర్గాదేవిగా (ఆకుపచ్చ), 7న మహాలక్ష్మి దేవిగా (పెసరు), 8న దుర్గాదేవి (ముదురు నీలం), 9న సరస్వతి దేవి (తెలుగు), 10న మహిషాసుర మర్దిని దేవిగా (ఎరుపు), 11న సర్వ నారాయణి దేవిగా (మెరూన్), చివరి రోజు 12న విజయదశమిని పురస్కరించుకొని రాజరాజేశ్వరి దేవి (పసుపు)గా వనదుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. ప్రతిరోజు ప్రాతఃకాల సమయాన అమ్మవారికి అభిషేకం, ఉదయం విఘ్నేశ్వర పూజ తదితరాలు నిర్వహిస్తామని తెలిపారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. 8న వనదుర్గామాతకు అంగరంగ వైభవంగా బోనాలు, 11న సుహాసిని పూజ, చండీ హోమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులు ఈ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో పాల్గొని వనదుర్గామాత కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు.