తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి ఫూలే : కలెక్టర్

by Kalyani |
తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి ఫూలే : కలెక్టర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : స్త్రీల విద్య, అభివృద్ధికి కృషి చేసిన తొలి తరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి ఫూలే అని కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ లో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి బాయి పూలే చిత్ర పటానికి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, అధికారులు పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి సావిత్రి బాయి పూలే అని కొనియాడారు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పులే అన్నారు. సావిత్రి బాయి పులే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా గుర్తించిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీ ఈ ఓ శ్రీనివాస్ రెడ్డి, మహిళా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరికి కమిషనర్ ఆఫ్ పోలీస్ డా. అనురాధ, జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగ రాజమ్మ, ఆర్డీఓ లు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed