సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలిః కలెక్టర్ రాహుల్ రాజ్

by Nagam Mallesh |
సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలిః కలెక్టర్ రాహుల్ రాజ్
X

దిశ, మెదక్ ప్రతినిధిః సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ హాలులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల జీవిత చరిత్ర పోరాటపటిమా నాయకత్వ లక్షణాలు నేటి యువతరానికి అవగతం కావాలని అన్నారు. సర్దార్ పాపన్న గౌడ్ పేద కుటుంబంలో పుట్టి గొప్ప నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని ప్రజలను పీడిస్తున్న జమీందారుల నుంచి విముక్తి కలిగించారన్నారు. మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ మంచి సమాజ నిర్మాణానికి పాటుపడాలని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాజుగౌడ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, పట్టణ గౌడ్ సంఘం అధ్యక్షులు కృష్ణ గౌడ్, కౌన్సిలర్స్ లక్ష్మీనారాయణ గౌడ్, శ్రీనివాస్, ముత్యం గౌడ్, మాజీ కౌన్సిలర్ శేఖర్ గౌడ్ , బీసీ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, గిరిజన సంక్షేమ శాఖ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed