- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దశాబ్ధి ఉత్సవాల పేరుతో పాలన గాలికొదిలేసిన సర్కార్ : మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి
దిశ, మెదక్ ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాల పేరుతో పాలన పూర్తిగా గాలికొదిలేసి ప్రజాధనంతో ప్రచారం చేసుకుంటున్నారని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ సమస్యలను కలెక్టర్ కు చెప్పుకుందామని ప్రజలు కలెక్టరేట్ కు వస్తే దశాబ్ధి ఉత్సవాలు పూర్తయ్యే వరకు ప్రజావాణిని రద్దు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ధరణి పేరుతో తెలంగాణ సర్కార్ దగాకు పాల్పడుతోందని, రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. రైతులు ధాన్యం తూకం చేసి నెల రోజులవుతున్న నేటికి ధాన్యం డబ్బు అందలేదని ఆరోపించారు. తెలంగాణ సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను గడప గడపకు వివరిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ సర్కారు ను బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.