సంగారెడ్డి మున్సిపాలిటీలో అవినీతిపై విచారణ చేపట్టాలి : బీజేపీ నాయకులు డిమాండ్

by Shiva |   ( Updated:2023-03-05 13:07:57.0  )
సంగారెడ్డి మున్సిపాలిటీలో అవినీతిపై విచారణ చేపట్టాలి : బీజేపీ నాయకులు డిమాండ్
X

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టి సంబంధిత అధికారులు, మున్సిపల్ చైర్ పర్సన్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ కౌన్సిలర్లు మందుల నాగరాజు, నాయికోటి రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగారెడ్డి మున్సిపాలిటీలో చైర్మన్ బంధు, బలగం పని చేయకుండా గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉంటూ మున్సిపాలిటీన నుంచి జీతాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.మున్సిపల్ శాఖలోశానిటేషన్ విభాగం, వాటర్ వర్క్స్ కలిపి 384 మంది పనిచేస్తున్నారని, కానీ పనిచేస్తున్నది కేవలం 300 మందేనని మిగిలిన 84 మంది పని చేయకుండా మున్సిపల్ శాఖ ద్వారా బిల్లులు పొందుతున్నారని ఆరోపించారు.

పారిశుధ్య కార్మికులు ఒక్క రోజు విధులకు హాజరు కాకాపోతే జీతాలు కట్ చేస్తూ విధుల నుంచి తొలగిస్తారని, కానీ, చైర్ పర్సన్ బంధువులు డ్యూటీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నా అడిగేవారే లేరని ఆరోపించారు. అవినీతిపై అధికారులకు, కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని విషయంపై విజిలెన్స్ కమిటీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు ఈ విషయంపై స్పందించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కసిని వాసు, పట్టణాధ్యక్షులు రవిశంకర్, దోమల విజయ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story