- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sangareddy Collector : వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి రుణమాఫీ
దిశ, సంగారెడ్డి : రైతుల రుణ భారాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా కొనసాగేలా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలోని వీడియో సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధ్యక్షతన లబ్దిదారులైన రైతులు, జిల్లాలోని వ్యవసాయ శాఖ సహకార శాఖ బ్యాంకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ సందేశాన్ని తిలకించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 18న తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లక్ష లోపు రుణాలు, సంగారెడ్డి జిల్లాలో మొదటి విడత రుణమాఫీలో 48,970 కుటుంబాలకు చెందిన 51,167 మంది రైతులకు రూ.279. 62 కోట్ల రూపాయలు రుణమాఫీ క్రింద జమచేయడం జరిగిందన్నారు.
రెండవ విడత రుణమాఫీలో ఒక లక్ష ఒక రూపాయల నుండి రూ.1.50 లక్ష లోపు రుణాలు ఉన్న 27,249 మంది రైతులకు రూ. 286.76 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని వివరించారు. జిల్లాలో ఎక్కడైనా క్షేత్రస్థాయిలో రైతులకు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే, వాటిని పరిష్కరించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, రైతులు నేరుగా 08455-276456 నెంబర్ కు ఫోన్ చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఆధార్ కార్డులు పొరపాట్లు కారణంగా రుణమాఫీ జాబితాలో పేరు రాని, ఖాతాలో డబ్బులు జమకాని రైతులకు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రుణమాఫీ జరిగేలా చూడాలని జిల్లాలోని వ్యవసాయ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అందాలని, వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు రుణమాఫీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిణి అంబికా సోనీ, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.