కాలేజీ వద్ద ఆర్టీసీ బస్సులను ఆపాలి

by Sridhar Babu |
కాలేజీ వద్ద ఆర్టీసీ బస్సులను ఆపాలి
X

దిశ, జిన్నారం : జిన్నారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఆర్టీసీ బస్సులను ఆపాలంటూ బుధవారం విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకొని విద్యార్థులు వారి నిరసనను వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులను కళాశాల వద్ద ఆపకపోవడంతో రెండు కిలోమీటర్లు అదనంగా నడవాల్సి వస్తుందని విద్యార్థులు వాపోయారు. ప్రతి బస్సును కళాశాల వద్ద ఆపితే తమకు ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు. స్థానిక పోలీసులు కల్పించుకొని ఆర్టీసీ డిపో మేనేజర్ తో మాట్లాడి సమస్యలు వివరించారు. ప్రతి బస్సును కళాశాల వద్ద ఆపేలా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ డిపో అధికారులు తెలపడంతో విద్యార్థులు వారి ఆందోళనను విరమించారు.

Advertisement

Next Story