మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ : కాన్యాయ్ ని అడ్డుకున్న యువజన కాంగ్రెస్ నాయకులు

by Shiva |
మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ : కాన్యాయ్ ని అడ్డుకున్న యువజన కాంగ్రెస్ నాయకులు
X

దిశ, అక్కన్నపేట : హుస్నాబాద్ లో కేటీఆర్ పర్యటన సందర్భంగా విపక్షాల నిరసన సెగ తగిలింది. శుక్రవారం అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వెళుతున్న మంత్రి కేటీఆర్ కాన్వాయిని యువజన కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధిని, వారు చేసినట్టుగా చూపించుకొని ఆర్భాటాలు చేస్తున్నారని అన్నారు.

డబుల్ బెడ్ రూంలు ఎంతమంది నిరుపేదలకు అందించారంటూ ప్రశ్నించారు. హుస్నాబాద్ లో అభివృద్ధి ఎక్కడ జరిగిందని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అక్కన్నపేట యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పాండ్రాల దాము, కోహెడ యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దూలం శీను, హుస్నాబాద్ యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పోచవేని శ్రీశైలం, అక్కన్నపేట యువతన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భాష వేణి రాజు, విశ్వతేజ, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story