సిద్దిపేటకు రైలు వచ్చింది..

by Sumithra |   ( Updated:2023-10-03 18:14:10.0  )
సిద్దిపేటకు రైలు వచ్చింది..
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట ప్రజల దశాబ్దాల రైలు కల నేరవేరింది. సిద్దిపేట టూ సికింద్రబాద్ రైలును సాయంత్రం 4:15 నిమిషాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. సిద్దిపేట రైల్యేస్టేషన్ లో మంత్రి హరీష్ రావు రైలు వద్ద పచ్చ జెండా ఉపారు. ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్మన్ రోజాశర్మ పలువురు బీఆర్ఎస్ నాయకులు సిద్దిపేట నుండి దుద్దేడ రైల్వే స్టేషన్ వరకు రైల్లో ప్రయాణించారు. ఇదిలా ఉంటే రైలు ప్రారంభోత్సవం సందర్భంగా సిద్దిపేట రైల్వే స్టేషన్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైలు ప్రారంభోత్సవానికి బీజెపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ నాయకులు హాజరు కావడంతో ఇరు పార్టీల నాయకులు పోటీపోటీగా నినాదాలు చేసుకున్నారు.

సభ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఫోటోలు లేకుండా ఏర్పాటు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు వేదిక వద్ద, రైల్వేస్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లెక్సీలను చించి వేశారు. ఓకానోక సందర్భంలో బీఆర్ఎస్ నాయకుల మద్య తోపులాట చోటుచేసుకుంది. ఇరు వర్గాలు ఒక్కరిపై ఒక్కరు కుర్చీలు వేసుకోవడంతో పలువురికి గాయాలైయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను శాంతింప చేయడంతో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ నాయకులు గజ్వేల్ వరకు రైలులో ప్రయాణించారు. ఇదిలా ఉంటే సిద్దిపేటకు రైలు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్,మంత్రి తన్నీరు హరీష్ రావు దే అని బీఆర్ఎస్ నాయకులు, రైల్వేలైన్ క్రిడిట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దే అని బీజేపీ ప్రకటించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed