- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేతకిలో కేంద్ర సహాయ మంత్రి పూజలు
దిశ, ఝరాసంగం: రాష్ట్రంలోని శైవ క్షేత్రాల్లో ఒకటైన ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో శనివారం కేంద్ర రసాయన ఎరువుల శాఖా సహాయ మంత్రి భగవత్ కూభా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వారికి ఆలయ రాజగోపురం వద్ద అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలిచారు. అనంతరం వారు స్వామివారి అమృతగుండంలో జల లింగాన్ని పూజలు నిర్వహించారు. నేరుగా గర్భాలయంలోని శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి దర్శించుకుని రుద్రాభిషేకం, నైవేద్యం మహా మంగళారతి కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం ఆలయ అధికారులు కేంద్ర మంత్రిని పూలమాల శాలువాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటేశం, కార్యనిర్వహణ అధికారి శశిధర్ అర్చకుల బృందం పాల్గొన్నారు. అంతకుముందు కుప్పా నగర్, చీల్లేపల్లి గ్రామ శివారులో గల మల్లన్న గట్టు శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శించుకున్నారు.