- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయ అనుమతులు సువిధ యాప్‌లో పొందాలి
దిశ, సంగారెడ్డి: ఎన్నికల ప్రచారానికి సభలకు సమావేశాలకు, వాహనాల అనుమతులు, బహిరంగ సభలకు అనుమతులను సువిధ ఆప్‌లోనే పొందాలని డీఆర్ఓ పద్మజారాణి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి పద్మజారాణి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా, ఎన్నికల నియమావళి పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఈ నెల 16 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. ఎన్నికల ప్రచారానికి సభలకు సమావేశాలకు, వాహనాల అనుమతులు, బహిరంగ సభలకు అనుమతులు సువిధ ఆప్‌లోనే పొందాలని సూచించారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ఎన్నికల నియమావళిని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనకు పాల్పడరాదని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించినట్లు సమాచారం ఉంటే ఫోటోలు, వీడియోలను ఈసీఐ కల్పించిన సీ విజిల్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చులు వివరాలు కోసం కొత్త బ్యాంకు ఖాతాను తెరవాలని, బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన జమ, ఉపసంహరణలు, నగదు లావాదేవీలు ఖర్చుల రసీదుల వివరాలు పూర్తిగా నమోదు చేయాలన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోని సహాయ ఎన్నికల పరిశీలకులు షాడో రిజిస్టర్లో నమోదు చేస్తున్న లెక్కలతో సరి చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏఓ పరమేష్. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాషా, తార సింగ్, మానిక్, రాములు, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.