Disha Effect : రంగాయపల్లి గ్రామానికి వెళ్ళి మహిళలతో మాట్లాడిన అధికారులు

by Kalyani |
Disha Effect : రంగాయపల్లి గ్రామానికి వెళ్ళి మహిళలతో మాట్లాడిన అధికారులు
X

దిశ, తూప్రాన్: 15 రోజులుగా త్రాగునీరు రావడం లేదని శుక్రవారం ఉదయం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని రంగాయపల్లి గ్రామ పంచాయతీ ఎదురుగా బిందెలతో మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలిపి ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిందెలను కింద కొట్టిన విషయం ‘దిశ’ లో ఉదయం ప్రచురించగా స్పందించిన అధికారులు గ్రామానికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడారు. పరిశ్రమలకు నీరు అమ్ముకుంటూ పేద ప్రజలకు త్రాగునీరు లేకుండా చేస్తున్నారని మహిళలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా త్రాగునీరు లేకుండా ఇబ్బందులు పడుతుంటే ఇప్పటి వరకు ఎవరూ రాకపోవడం పై కన్నెర్ర చేశారు. మా గ్రామానికి ఏ నాయకుడు రావొద్దని వచ్చిన అడ్డుకుంటామని హెచ్చరించారు. గ్రిడ్ ఏఈ శ్రీధర్, దివ్య మాట్లాడుతూ.. పరిశ్రమలకు నీరు వెళ్లడం, గ్రామాలకు వెళ్లి వాటికి ఎటువంటి సంబంధం ఉండదని అక్కడక్కడ లీకేజీ లు పైప్ లలో ఎయిర్ రావడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి అని తెలిపారు. గ్రామాలకు సరిపోయేలా రెండు పూటలా నీటిని వదిలి వెంటనే సమస్య పరిష్కారం చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story