- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒర్రకుంట అక్రమణలపై కదిలొచ్చిన అధికారులు : దిశ కథనానికి స్పందన
దిశ, గుమ్మడిదల : జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని ఒర్రకుంటలో యథేచ్ఛగా కొనసాగిస్తున్న అక్రమ నిర్మాణాలపై దిశ పత్రికలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. మంగళవారం ఈఈ మధుసూదన్ రెడ్డి, ఆర్డీవో నాగేష్, స్థానిక రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో కలిసి కుంట స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే అనంతరం పూర్తి వివరాలను తెలియజేసి కుంటలో జరుగుతున్న నిర్మాణాలను కూల్చివేస్తామని తెలిపారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుంటలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై వార్తను ప్రచురించినందుకు గాను బొల్లారం ప్రజలు దిశ పత్రికను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీఈఈ రామస్వామి, తహసీల్దార్ దశరథ్ సింగ్, ఏఈఈ దిలీప్, ఆర్ఐ జయప్రకాశ్, సర్వైవర్ రామభద్రం, తదితరులు పాల్గొన్నారు.