- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్కల దాడిలో తొమ్మిది గొర్రెలు హతం
దిశ, ఖానాపూర్: ఖానాపూర్ మండల పరిధిలోని నడింపల్లెకు చెందిన దాసరి పోషమల్లుకు చెందిన గొర్రెల పాకలోకి కుక్కలు చొరబడి దాడి చేయగా తొమ్మిది గొర్రెలు మృతి చెందాయి. మిగితా గొర్రెలు గాయపడ్డాయి. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మండల కేంద్రం, సుర్జాపూర్, ఎర్వచింతల్, భీరనంది గ్రామాల్లో ప్రజలు, పశువులపై ఇటీవల ఊరు కుక్కల దాడులు ఎక్కువయ్యయి. కడం మండలంలోని అంబర్ పేట్ గ్రామంలో ఊరు కుక్కలు దాడిలో పది గొర్రెలు మృతి చెందాయి. ఇంత జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు మాత్రం ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తురని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నష్ట పరిహారం చెల్లించాలని ధర్నా..
ఊరు కుక్కల దాడిలో మృతి చెందిన గొర్రెల యజమాని దాసరి పోశామల్లుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని గ్రామంలోని చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఘటన స్పందించి అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.