ఇక రానున్నాయి నైట్ విజన్ యుద్ధ ట్యాంకులు

by Naresh |   ( Updated:2024-03-14 10:29:21.0  )
ఇక రానున్నాయి నైట్ విజన్ యుద్ధ ట్యాంకులు
X

దిశ, కంది: యుద్ధ రణరంగంలో సైనికులు శత్రు దేశాల పై విరుచుకుపడేలా యుద్ధ ట్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయి. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఓడిఎఫ్‌లో తయారు చేస్తున్న అధునాతన బీఎంపీ 2 యుద్ధ ట్యాంకులను కేంద్ర రక్షణ రంగానికి ఇక్కడ తయారు చేసి వారికి అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధ ట్యాంకులో కొన్ని అధునాతన మార్పులను కేంద్ర రక్షణ రంగం కోరింది. రాత్రిళ్ళు కూడా శత్రువుల టార్గెట్లను సులువుగా తెలుసుకొని ముందుకు దూసుకుపోయేలా నైట్ విజన్ ఎనేబిలిటీని రూపొందించాలని చెప్పింది. దీంతో పాటు ఫైర్ కంట్రోల్ సిస్టం కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మేరకు గురువారం ఓడిఎఫ్ (ఏవీఎన్ఎల్) సీఎండీ సంజయ్ దివేది కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పంద పత్రాన్ని కుదుర్చుకున్నారు. నైట్ విజన్ ఎనేబిలిటీతో పాటు ఫైర్ కంట్రోల్ సిస్టంను కొత్తగా తీసుకొచ్చే యుద్ధ ట్యాంకులో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు.



BMP-II యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు.

1. CCD, థర్మల్ ఇమేజర్ (TI) సైట్, లేజర్ రేంజ్ ఫైండర్ (LRF)తో గన్నర్ & కమాండర్ దృష్టి.

2. అన్ని ఆయుధాల కోసం సమీకృత అగ్ని నియంత్రణ వ్యవస్థ (PKT గన్, 2A42, ATGM)

3. గన్నర్ & కమాండర్ కోసం మల్టీ ఫంక్షన్‌లో డిస్ప్లే

4. MET- ఫైర్ కంట్రోల్ సిస్టమ్ కోసం సెన్సార్

5. ఆటో టార్గెట్ ట్రాక్టర్

6. ATGM యొక్క నైట్ ఫైరింగ్ సామర్థ్యం

7. ఖచ్చితత్వం, కార్యాచరణ సామర్థ్యంలో గణనీయమైన మెరుగుదల

8. మెరుగైన పరిస్థితుల అవగాహన కోసం BMP-2 వెనుక వైపు ట్రూపర్ ప్రదర్శనలు. ఇవి గతంలో తయారు చేసిన బీఎంపీ 2 యుద్ధ ట్యాంక్‌లో ఉన్న అప్గ్రేడ్ ఫీచర్లు. కాగా తాజాగా తయారు చేస్తున్న బీఎంపీ - 2 ఎం యుద్ధ ట్యాంకులో నైట్ విజన్ ఎనేబిలిటీతో పాటు ఫైర్ కంట్రోల్ సిస్టంను కొత్తగా జోడించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed