- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అదృశ్యమా.. ఆత్మహత్యా! మిస్టరీగా జంట మిస్సింగ్..
దిశ, చేగుంట: నార్సింగ్ మండల కేంద్రంలో ఒక యువకుడు, వివాహిత, అదృశ్యమైన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రానికి చెందిన ఒక యువతికి రెండు నెలల క్రితం వివాహం జరిగింది. గ్రామంలో జరుగుతున్న పండుగ సందర్భంగా గ్రామానికి వచ్చిన యువతి సోమవారం మధ్యాహ్నం నుండి అదృశ్యo కావడంతో గాలింపు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం ఇంటి నుండి వెళ్లిన యువతి గురించి గ్రామంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా బస్సులో వెళ్ళినట్టుగా గుర్తించారు.
ఆ తర్వాత రామాయంపేటలో మరో యువకుడితో బైక్ పై వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. నార్సింగ్ చెరువు వద్ద ఇరువురి చెప్పులు, బైక్ లభించడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివాహిత, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారా? లేక అదృశ్యమయ్యారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. గజ ఈతగాల్ల సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రేమికుల రోజు వివాహితతో మరో యువకుడు అదృశ్యమైన సంఘటన సంచలనంగా మారింది.